మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (20:06 IST)

ఆ కాయతో కరోనా పరార్ అంటూ టిక్ టాక్ వీడియో, నూరి మింగేశారు, ప్రాణం మీదకు తెచ్చుకున్నారు

టిక్ టాక్ వీడియో ప్రాణం మీదకు తెచ్చింది.. టిక్ టాక్ వీడియోలో లోకేష్ అనే ఓ యువకుడు చేసిన పని రెండు కుటుంబాల్లోని 12 మంది ప్రాణాల మీదకు తెచ్చింది.

ఉమ్మెత్త కాయలు తినడం, ఉమ్మెత్త కాయలతో కషాయం చేసుకుని తాగితే కరోనా వైరస్ సోకదంటూ టిక్ టాక్ వీడియో చేశాడు.

ఇది నిజమని నమ్మిన రెండు కుటుంబాల్లోని 12 మంది ఉమ్మెత్త కాయలతో కషాయం చేసుకుని తాగడంతో తీవ్ర అస్వస్తతకు గురయ్యారు.

వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అస్వస్తతకు గురైన వారికి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం ఆళ్ళపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.