సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (16:12 IST)

హైదరాబాద్ రోడ్లపై చిరుత

ఘాట్ రూడ్లపైనా, తిరుమలలోనూ వన్యప్రాణులు స్వేచ్ఛ గా తిరుగుతున్నాయని వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో అక్కడే కాదు హైదరాబాద్ లో కూడా మా రాజ్యమే నడుస్తున్నది అంటూ ఒక చిరుత కనిపించింది.

హైదరాబాద్ లోని బంజాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో చిరుత రోడ్డు దాటుతుండగా కొందరు కెమెరాలో చిత్రీకరించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నుంచి అపోలో ఆసుపత్రి వైపు వెళ్లే రోడ్డులో చిరుత కనిపించింది.
 
రోడ్డు దాటి వెళ్లిన ఈ చిరుత బహుశ అక్కడి కెబిఆర్ పార్క్ లోకి వెళ్లి ఉంటుంది. కెబిఆర్ పార్క్ లో చిన్న ప్రాణులు ఉంటాయి కాబట్టి ఆహారం వెతుక్కుంటూ వెళ్లి ఉండాలి.

ఈ నెల 18న రాత్రి ఈ వీడియో తీశారు. కాబట్టి ఆ రోడ్డుపై సంచరించే వారు కాలినడకన వెళ్లకపోవడం మంచిది.