శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 6 మే 2020 (20:50 IST)

లోకేష్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి: వైసీపీ

లోకేష్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నాయకులు అన్నారు. మంగళగిరి పట్టణంలోని వైకాపా మాజీ కౌన్సిలర్ సంకే సునీత నివాసంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షులు మునగాల మలేశ్వరావు, గుంటూరు పార్లమెంటు అధికార ప్రతినిధి శ్యామ్ బాబు మాట్లాడారు.

మంగళగిరి పట్టణంలో 32వ వార్డు లో చోటుచేసుకున్న ఘటన నారా లోకేష్ స్క్రీన్ ప్లే లొనే జరిగిందని దాన్ని వైయస్సార్ సిపి నియోజకపార్టీ ఖండిస్తుందని అన్నారు. కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నారని. మంగళగిరి పట్టణంలో రెండు పాసిటీవ్ కేసులు నమోదై వారు పూర్తిగా కోలుకుని ఇంటికి చేరిన సంగతి తెలిసిందేనని అన్నారు.

ఈ తరుణంలో కుల రాజకీయాలకు తెర తీయటం సరికాదని విమర్శించారు. మంగళగిరి లో పోటీ చేసి గెలవలేదన్న కక్షతో ఇక్కడ వివాదాలు చేయాలని చూడడం సరికాదన్నారు.

గోరంతను కొండంత చేయడంలో తెదేపా ముందుంటుందని చెప్పారు. కక్ష సాధింపు రాజకీయాలు మానుకుని నిజానిజాలు తెలుసుకోవాలన్నారు.