సంబంధిత వార్తలు
- కోవిడ్ రోగుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు
- ఆంధ్ర నుంచి ఆక్సిజన్ ప్లాంట్లు ప్రారంభిస్తా: సోనూ సూద్
- ప్రపంచ ఆరోగ్య సంస్థ 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల సాయం
- ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందుల్ని అధిగమించి రోగులకు భరోసా ఇస్తున్న ఎపి పోలీస్
- సోనూసూద్ సాయం కోరుతూ నెల్లూరు జిల్లా కలెక్టర్ లేఖ, కోటిన్నర ఆక్సిజన్ జనరేటర్ రెండు రోజుల్లో...
Oxygen తరలిస్తున్న గూడ్సులో మంటలు
పెద్దపల్లి: ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగడం పెద్దపల్లి జిల్లాలో కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి రాయ్‌పూర్‌కు ఆరు ట్యాంకర్లతో వెళ్తున్న ఈ రైలులోని ఒక ట్యాంకర్‌లో కూనారం-చీకురాయి మధ్య అకస్మాత్తుగా మంటలు రేగాయి.
దీంతో అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినఅక్కడికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ప్రమాదం జరిగిన బోగీని మిగతా బోగీల నుంచి విడగొట్టి దూరంగా తరలించారు.
అయితే, ఈ ప్రమాదానికి కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదు. పైన విద్యుత్ తీగలు ఉండటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు