1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. PM Modi to inaugurate Hyderabad Metro Rail on Nov 28

28 నుంచి హైదరాబాద్ మెట్రో సేవలు ప్రారంభం

హైదరాబాద్ మహానగరంలో మెట్రో సేవలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 28వ తేదీన హైదరాబాద్‌కు వచ్చే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సేవలను ప్రారంభించనున్నారు.

Hyderabad Metro Rail
హైదరాబాద్ మహానగరంలో మెట్రో సేవలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 28వ తేదీన హైదరాబాద్‌కు వచ్చే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సేవలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అంది. 
 
ఈనెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని మోడీ చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా అంటే 3 గంటల 25 నిమిషాలకు మియాపూర్ మెట్రో స్టేషన్ చేరుకొని… మెట్రో రైల్‌ను ప్రారంభిస్తారు. మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వరకు 5 కిలోమీటర్లు రైలులో ఆయన ప్రయాణిస్తారు. తిరగి మియాపూర్ చేరుకుని.. అక్కడే ఏర్పాటు చేసే ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. 
 
మెట్రో ప్రారంభం తర్వాత హెలికాప్టర్‌లో హెచ్ఐసీసీ చేరుకుని, ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు రోడ్డుమార్గంలో ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసే విందుకు హాజరవుతారు. ఆ తర్వాత ఎనమిదిన్నరకు శంషాబాద్ నుంచి తిరిగి ఢిల్లీ వెళతారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
భార్యతో అక్రమసంబంధం.. అడ్డుచెప్పిన భర్తను గొంతుకోసి హత్య...