1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. PM Narendra Modi: Prime Minister Modi will visit Telangana next month

వచ్చే నెలలో భాగ్యనగరికి వస్తున్న ప్రధాని.. ఎందుకో తెలుసా?

narendramodi
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెలలో హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. ఏప్రిల్ 8వ తేదీన భాగ్యనగరికి వచ్చే ఆయన... సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య వందే భారత్ రైలు సేవలను జెండా ఊపి ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సికింద్రాబాద్ - విశాఖపట్టణం ప్రాంతాల మధ్య ఈ వందే భారత్ రైలు నడుస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు కొత్తగా మరో రైలును తెలుగు రాష్ట్రాల్లో నడుపనున్నారు. అయితే, సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడిపే వందే భారత్ రైలు ప్రయాణ సమయం, చార్జీలను దక్షిణ మధ్య రైల్వే బహిర్గతం చేయాల్సివుంది.
 
ఇదిలావుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు, ప్రధాని మోడీకి ఏమాత్రం పొసగడం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అలాగే, ఈ రెండు పార్టీల నేతల మధ్య కూడా మాటల యుద్ధం సాగుతోంది. గతంలో ప్రధాని హైదరాబాద్ నగరానికి వచ్చినపుడు కూడా ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ ఎయిర్‌పోర్టుకు కూడా వెళ్లని విషయం తెల్సిందే. మరి ఈ దఫా ఎలా చేస్తారో వేచి చూడాల్సివుంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలెర్ట్ జారీ... రైతులు అప్రమత్తంగా ఉండాలి...