శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (15:08 IST)

జపాన్ ప్రధాని కిషిదకు పానీపూరి రుచి చూపించిన ప్రధాని మోడీ

japan pm pani puri
అధికారిక పర్యటన కోసం న్యూఢిల్లీకి జపాన్ దేశ ప్రధాని ఫుమియో కిషిద భారతీయ వంటకాలను రుచి చూశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరుండి మరీ ఈ వంటకాలను తినిపించారు. ముఖ్యంగా, భారత్‌లో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అయిన పానీపూరీ (గోల్‌గప్ప)ని ఆయనకు తినిపించారు. భారతీయ పానీ4పూరి రుచి జపాన్ ప్రధాని ఎంతగానో నచ్చడంతో ఆయన లొట్టలేసుకుని ఆరగించారు. 
 
భారత్‌, జపాన్‌ మధ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించేందుకు గానూ ఇరు దేశాల ప్రధానులు సోమవారం ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్క్‌ను సందర్శించారు. ఉద్యానవనమంతా కలియదిరుగుతూ వీరిద్దరూ కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం అక్కడి ఫుడ్‌ స్టాళ్ల వద్దకు వెళ్లి భారతీయ అల్పాహార వంటకాలను, పానీయాలను రుచిచూశారు. 
 
ఇరు దేశాల ప్రధానులు కవ్వంతో మజ్జిక చిలికారు. ఆ తర్వాత కిషిదకు ప్రధాని మోడీ పానీపూరీ గురించి చెప్పి దాని రుచి చూపించారు. ఆ రుచిని అమితంగా ఇష్టపడిన జపాన్‌ ప్రధాని ఇంకోటి కావాలని అడిగారు. పానీపూరీతో పాటు ఫ్రైడ్‌ ఇడ్లీ, మామిడితో చేసిన షర్‌బత్‌ను కిషిద రుచిచూశారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.