శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2023 (10:48 IST)

బీటెక్ గ్రాడ్యుయేట్.. ఢిల్లీలో పానీపూరీ అమ్మేస్తూ అదరగొడుతోంది..

Pani Puri
Pani Puri
21 ఏళ్ల ఢిల్లీ బీటెక్ గ్రాడ్యుయేట్ పశ్చిమ ఢిల్లీలో తన వినూత్నమైన పానీ పూరీ స్టాల్‌తో డబ్బు బాగా సంపాదిస్తోంది. మైదాకు బదులుగా గోధుమ పిండి, సుజీతో చేసిన పానీ పూరీని విక్రయిస్తోంది. ఈ స్టాల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వ్యాపారవేత్త తాప్సీ, తన స్టార్టప్ రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీ పూరీని తయారు చేయడంపై దృష్టి పెడుతుందని ఈ వీడియోలో వివరించింది.
 
ఈ పానీపూరీలు అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పింది. బీటెక్ చేసిన యువతి పానీపూరీ స్టాల్‌తో డబ్బు సంపాదించడం భలే అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. బుల్లెట్ బండిపై పానీపూరీ అమ్ముతూ.. మొబైల్ పానీపూరీ స్టాల్‌గా ఆమె చేస్తున్న బిజినెస్ అదుర్స్ అంటూ వారు కామెంట్లు పెడుతున్నారు.