గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2023 (10:22 IST)

ఢిల్లీలో షాకింగ్ ఘటన.. సీటు కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు..

దేశ రాజధాని నగరం ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
బస్సులో ఓ యువతి, మహిళల మధ్య సీటు విషయంలో వివాదం.. జుట్టుపట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
 
ఈ వీడియోలో ఫుటేజీలో స్త్రీలు, అమ్మాయి ఒకరి జుట్టు ఒకరు లాగుతున్నట్లు చూపిస్తుంది. మరో ఇద్దరు మహిళలు జోక్యం చేసుకుని గొడవను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు.
 
కానీ ఫలితం లేకుండా పోయింది. కొద్దిసేపు వాగ్వాదం కొనసాగడంతో బస్సులో గందరగోళం నెలకొంది. చివరికి, పోలీసు కానిస్టేబుళ్లు బస్సులోకి ప్రవేశించి ఆ మహిళలను బస్సు నుంచి దించేశారు.