ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 9 మార్చి 2023 (23:01 IST)

రాగి బాటిల్, రాగి పాత్రలలో నిల్వ చేసిన నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు (video)

రాగి అనేది యాంటీఆక్సిడెంట్, అంటే ఇది అన్ని ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతుంది. వాటి వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను నిరాకరిస్తుంది. ఇంకా రాగి పాత్రలో మంచినీరు, ఆహారం తీసుకుంటుంటే జరిగే మేలు ఏమిటో తెలుసుకుందాము.హైపర్‌టెన్షన్‌ను బ్యాలెన్స్ చేస్తుంది, అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వెల్లడించిన దానిప్రకారం రాగి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. పలు కేన్సర్లను ఇది అడ్డుకుంటుంది.
 
రాగి థైరాయిడ్ గ్రంధి అసమానతలను సమతుల్యం చేసి థైరాయిడ్ గ్రంధి బాగా పనిచేయడానికి శక్తినిస్తుంది. రాగి హీమోగ్లోబిన్‌ను తయారుచేయసేందుకు శరీరానికి కావలసిన ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది.
 
రాగిలో వున్న యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల ఇది ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న రోగులకు ఉపశమనాన్ని అందిస్తుంది. 8 గంటల కంటే ఎక్కువ కాలం పాటు రాగి సీసాలలో నిల్వ చేయబడిన నీరు తాగితే రోగకారక సూక్ష్మజీవులను నిరోధిస్తుంది.
 
రాగి పాత్రలో నీటిని కానీ ఆహారాన్ని కానీ తింటుంటే గుండెకు రక్త ప్రసరణను పెంచడానికి రక్త నాళాలను విస్తరించడానికి సహాయపడుతుంది. మెదడు సామర్థ్యాన్ని పెంచడంలో రాగి పాత్ర కీలకంగా వుంటుందని చెప్పబడింది.