ఇద్దరమ్మాయిలతో యువకుడు.. ఒకే వేదికపై డుం.. డుం.. డుం.. (video)
ఇద్దరు వధువుల్ని ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు.. భద్రాద్రి యువకుడు. వివరాల్లోకి వెళితే.. మూడేళ్ల పాటు సహజీవనం చేసిన ఆ యువకుడు ఒకే వేదికపై ఇద్దరినీ పెళ్లి చేసుకున్నాడు.
భద్రాద్రి జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన సత్తిబాబు.. మూడేళ్ల పాటు స్వప్న, సునీత అనే ఇద్దరమ్మాయిలతో ప్రేమలో వున్నాడు.
ఇద్దరినీ ఒకేసారి పెళ్లి చేసుకోవడం.. అతని పెళ్లికి పెద్దలు అంగీకారం తెలపడం.. సోషల్ మీడియా పెళ్లి పత్రిక వైరల్ కావడం సంచలనం అయ్యింది. ప్రస్తుతం సత్తిబాబు స్వప్న, సునీతలను ఒకే వేదికపై పెళ్లి చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.