సంబంధిత వార్తలు
- పథకం ప్రకారమే ప్రియాంకా రెడ్డి వాహనం పంక్చర్, అదుపులో నలుగురు
- ప్రియాంకా రెడ్డి హత్య కేసును స్వయంగా పర్యవేక్షిస్తా.. : మంత్రి కేటీఆర్
- ప్రియాంకాను డీసీఎంలో రేప్ చేశారా? అదుపులో నలుగురు నిందితులు?
- డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య.. కర్మను నమ్ముతానంటున్న కీర్తి సురేష్
- డ్రైవర్ల ఘాతుకం... లారీలను అడ్డుపెట్టి డాక్టర్ ప్రియాంకాపై అత్యాచారం...
పోలీసులు త్వరగా స్పందించే వుంటే మా అమ్మాయి బ్రతికి వుండేది : ప్రియాంకా రెడ్డి తండ్రి ఆరోపణ
హైదరాబాద్ సమీపంలో జరిగిన వైద్యురాలు ప్రియాంకారెడ్డి అత్యాచారం, హత్య వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అత్యాచారం తరువాత నిందితులందరూ పారిపోయారు. అయితే ప్రియాంకారెడ్డిపై అత్యాచారానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. నిందితులందరూ లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా గుర్తించారు.
అయితే ప్రియాంకారెడ్డి తండ్రి శ్రీధర్ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. టోల్‌గేట్ దగ్గర మా అమ్మాయి ఒంటరిగా ఉంది. సి.సి.కెమెరాలు ఎన్నో ఉన్నాయి. మా అమ్మాయి కనిపించలేదని ఫిర్యాదు చేసినప్పుడు సి.సి.కెమెరాలు చూస్తూ కూర్చోవడం మానుకొని మా అమ్మాయి కోసం వెతికి ఉంటే ఆమె బతికి ఉండేది.
ఫిర్యాదు చేయడానికి వెళితే పట్టించుకోలేదు. అసలు ఈ కేసు తమ పరిధిలోకి రాదనీ, రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అన్నారు. చివరికి మీడియాలో కథనాలు రావడంతో పరుగులు పెట్టారు. పోలీసులు వెంటనే స్పందించి ఉంటే మాకు శోకం మిగిలేది కాదు. మా అమ్మాయి విషయంలో పోలీసులు సరిగ్గా స్పందించలేదు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు శ్రీధర్ రెడ్డి.
