1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Revanth reddy open letter to cm kcr

సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy
సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షులు ఎం.పీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేయించాలని… పంటల బీమా అమలు కాకపోవడానికి తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని లేఖలో పేర్కొన్నారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలని… కొత్తగా పంటలు వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు, ఇన్ ఫుడ్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 
 
తదుపరి పంటల నుంచి ప్రభుత్వం ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకాల అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని… తక్షణం రూ.లక్ష రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయాలని లేఖలో డిమాండ్‌ చేశారు ఎంపీ రేవంత్‌ రెడ్డి.
About Writer
సెల్వి