మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జెఎస్కె
Last Modified: సోమవారం, 19 జులై 2021 (15:36 IST)

న‌న్ను పార్ల‌మెంటుకు రాకుండా తెలంగాణా పోలీసులు అడ్డుకున్నారు

ఒక ప‌క్క ఢిల్లీలో పార్లమెంటు వ‌ర్షాకాలం స‌మావేశాలు ప్రారంభం అయితే, త‌న‌ను మాత్రం పార్ల‌మెంటుకు రానీయ‌కుండా తెలంగాణా పోలీసులు అడ్డుకున్నార‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై లోక్ స్పీకర్ కు మల్కాజ్ గిరి ఎం.పీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. 
నేను తెలంగాణ లోని మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి లోకసభ కు ప్రాతినిధ్యం వహిస్తున్నా.

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) అధ్యక్షుడిగా పని చేస్తున్నాను.  రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో మా గొంతు వినిపించాలని నేను ప్ర‌త్నిస్తుంటే, త‌న‌ని తెలంగాణా పోలీసులు అడ్డుకున్నార‌ని ఆరోపించారు. తెలంగాణ లోని ప్రభుత్వ భూమిని కేసీయార్, వారి బంధువులకు, టిఆర్ఎస్ అధికార పార్టీ కార్యకర్తలకు అతి తక్కువ ధరలకు విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ, పార్లమెంటులో సమస్యను లేవనెత్తాలని నిర్ణయించుకున్నాం.

నేను ఈ రోజు నుండి జరగనున్న పార్లమెంటు సమావేశానికి హాజరు కావాలని, సంబంధిత అధికారులకు పదేపదే అభ్యర్థన చేసినప్పటికీ, ఢిల్లీకి వెళ్లాలని తెలిపినప్పటికీ తెలంగాణ రాష్ట్ర పోలీసులు పార్లమెంట్‌కు నేను వెళ్లాడాన్ని అడ్డుకున్నారు. పార్లమెంటు సభ్యుడిగా ప్ర‌జల ఆందోళనలను తెలియజేయడం నా హక్కు, నా బాధ్యత. పార్లమెంట్ నడుస్తున్న సమయంలో పార్లమెంట్ హక్కులను అడ్డుకొని పార్లమెంటుకు హాజరు కాకుండా చేశారు.

రాజకీయ కారణాలతో పార్లమెంటు సభ్యుడిని అరెస్టు చేయడానికి గౌరవ స్పీకర్ అనుమతి ఖచ్చితంగా అవసరం. అందువల్ల మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. పార్లమెంట్‌కు ఉన్న ప్రత్యేక హక్కులను ఉపయోగించి, నన్ను పార్లమెంట్లో పాల్గొని ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాన‌ని రేవంత్ రెడ్డి స్పీక‌ర్‌కు లేఖ రాశారు.