ప్రైవేట్ స్కూళ్ల వ్యాపారం.. పోరాటం చేస్తోన్న శివబాలాజీ దంపతులు
ShivaBalaji
మౌంట్ లితేరా స్కూలు నుంచి ఇలాంటి ఒత్తిళ్లు ప్రారంభం అయ్యాయని తెలిపారు. అనేక స్కూళ్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు. స్కూళ్లన్నీ సిండికేట్ అయ్యాయన్నారు. తల్లిదండ్రులకు అండగా ఉంటామని, తనకు వేరే పని లేదని, ఇదే పనిగా పెట్టుకుంటానన్నారు.
శివబాలాజీ సతీమణి మధుమిత మాట్లాడుతూ.. ''ముఖ్యమంత్రిపై గౌరవంతో అడుగుతున్నామని.. ప్రైవేట్ స్కూల్స్ ట్యూషన్ ఫీజ్ మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం చెప్పినా స్కూళ్లు ఇతరత్రా ఫీజులతో మానసిక క్షోభకు గురిచేస్తున్నాయని గుర్తు చేశారు. తాము ఇప్పటికే 35 శాతం ఫీజులు చెల్లించాం. పూర్తి ఫీజు కట్టలేదని పరీక్షలు రాయనివ్వటం లేదు. విద్యార్థుల తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.