గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (09:21 IST)

విద్యార్థిని ఆత్మహత్య.. ఎంసెట్‌లో మార్కు తక్కువొచ్చాయని?

తెలంగాణలో బుధవారం ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఎంసెట్ లో అర్హత సాధించలేదని నల్గొండకు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లా పూర్ గ్రామానికి చెందిన స్నేహ రెడ్డి అనే విద్యార్థిని నల్గొండ లోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. 
 
ఎంసెట్ లో అర్హత సాధించకపోవడంతో మనస్థాపానికి గురైన విద్యార్థిని బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
 
“అమ్మా నాన్నా నన్ను క్షమించండి. మీకు నా ముఖం చూపించలేను.. మీరు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ నిలబెట్టుకోలేక పోయాను. అందుకే మిమ్మల్ని వదిలి వెళుతున్నాను.” అంటూ స్నేహ రెడ్డి సూసైడ్ నోట్ లో రాసి ఆత్మహత్య చేసుకుంది. 
 
స్నేహ రెడ్డి తల్లి ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తోంది. ఇంటికి వచ్చిన తల్లి ఫ్యాన్ కు కూతురు ఉరి వేసుకోవడం చూసి షాక్ అయింది. కూతురు ఆత్మహత్య తో తల్లి తండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.