1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

తెలంగాణ రాష్ట్ర గవర్నరుగా బీఎస్.యడ్యూరప్ప??

సౌందర్ రాజన్ ఉన్నారు. అయితే, ఈమెకు పుదుచ్చేరి రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నరుగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈమె ఇపుడు రెండు రాష్ట్రాలకు గవర్నరుగా వ్యవహరిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ఆమెను పుదుచ్చేరికి మాత్రమే గవర్నరుగా పరిమితం చేసి, తెలంగాణా రాష్ట్రానికి కొత్త గవర్నరు‌ను నియమించాలన్న యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. పైగా, ఇటీవల ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించిన బీఎస్.యడ్యూరప్పను బుజ్జగించే చర్యల్లో భాగంగా, ఆయనకు గవర్నర్ పీఠాన్ని అప్పగించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందులోభాగంగా, తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నరుగా బీఎస్. యడ్యూరప్పను నియమించాలని ప్రధాని మోడీతో పాటు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. 
 
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే సమయంలో గవర్నర్ పదవిని కట్టబెడతామని యడ్యూరప్పకు బీజేపీ అధిష్టానం ఖచ్చితమైన హామీ ఇచ్చింది. ఈ హామీలోభాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నరుగా నియమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు సమాచారం.