1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Swarna Latha Bhavishyavani

లష్కర్ బోనాల ఉత్సవాల్లో రంగం : భవిష్యవాణిని వినిపించిన స్వర్ణలత

Swarna Latha Bhavishyavani
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ వేడుకల్లో భాగంగా లష్కర్ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు. 
 
కరోనా పరిస్థితుల వల్ల గత ఏడాది సరిగా పూజలు నిర్వహించలేకపోయామని ఆలయ పూజారులు చెప్పారు. దీనికి సమాధానంగా... మహమ్మారి ఇబ్బంది పెట్టినా నన్ను నమ్మి ప్రజలు పూజలు చేశారని అన్నారు. 
 
వర్షాల కారణంగా ప్రజలు, రైతులు కొంత ఇబ్బంది ఎదుర్కొంటారని, నేను మీ వెంట ఉండి నడిపిస్తానని చెప్పారు. అమ్మకి ఎంతో చేసినా ఏమీ ఒరగలేదని అనొద్దని... ప్రతి ఒక్కరినీ తాను కాపాడుకుంటానని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని చెప్పారు. ఇలా అమ్మవారు సంతోషంగా ఉన్నట్లు భవిష్యవాణి చెప్పడంతో భక్తులు ఎంతో సంతోషించారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
నాతో హీరోయిన్‌గా నటిస్తావా? జయంతితో సీనియర్ ఎన్టీఆర్