షూటింగ్‌లో వుండగానే మల్లిఖార్జునను పలుకరించిన సోనూసూద్
కరోనా సమయంలో ఆక్సిజన్ బేంక్‌ను నెలకొల్పి వాటి ద్వారా ఎందరో రోగులను కాపాడిన సోనూసూద్ ప్రజల్లో దేవుడిగా నిలిచాడు. మనషుల్లోనే దేవుడు వుంటారని భారతీయులు భావిస్తారు. అలా ఎదుటివారి కష్టాలను తన కష్టాలు భావించి తన మాతృమూర్తికి ఇచ్చిన మాట ప్రకారం సేవ చేస్తున్న సోనూసూద్‌కు జేజేలు పలుకుతున్నారు.
2020లోనే దేశంలో సామాన్యుడు కరోనావల్ల చాలా ఇబ్బందులు పడ్డాడు. వారి కష్టాన్ని సాల్వ్ చేసేందుకు సోనూ సూద్ నడుం కట్టాడు. అలా ఓ సోదరికి ఆపరేషన్ చేయాలంటే ఆఘమేఘాలమీద విమానంలో బెంగుళూరునుంచి హైదరాబాద్ వరకు తీసుకువచ్చి ట్రీట్‌మెంట్ చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇలా ఒక్కటికాదు ఎన్నో ఉదంతాలున్నాయి. తాజాగా మల్లిఖార్జున అనే వ్యక్తికి ఆయన ప్రాణం పోశాడు. గుండెజబ్బుతో బాధపడుతున్న ఆయన ఆసుప్రతికివెళితే ఆపరేషన్ తప్పనిసరి అన్నారు. అందుకు అమెరికా వెళ్ళాలని సిద్శమవుతుండగా కరోనా రక్కసి బ్రేక్ చేసింది. ఇక ఇక్కడ ఆపరేషన్ చేయాలంటే డాక్టర్లు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
ఆ సమయంలో సోనూసూద్ విషయం తెలుసుకుని నేనున్నాంటూ ముందుకు వచ్చాడు. అలా 2020లో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుప్రతిలో ఆపరేషన్ చేయించి సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం మల్లిఖార్జున ఆరోగ్యం బాగానేవుంది. తనకు ప్రాణం పోసిన సోనూసూద్ కు కృతజ్ఞతలు తెలియజెప్పడానికి ప్రయత్నించాడు. మరలా కరోనా సెకండ్‌వేవ్ వచ్చింది. దాంతో ఆయన్సు కలుసుకోవడం కుదరలేదు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయి. అందుకే ఈరోజు అనగా జులై 9వ తేదీన హైదరాబాద్‌లోనే సోనూసూద్ వున్నాడని తెలుసుకుని అక్కడకు వెళ్ళారు. ఎల్.బి. స్టేడియంలో సోనూసూద్ ఓ యాడ్ షూట్‌లో పాల్గొన్నాడు. షూట్‌లో వుండగానే మల్లిఖార్జున వచ్చాడని తెలిసి వెంటనే వచ్చి పలుకరించాడు. దాంతో ఆనందంతో కూడిన హృదయంతో ఆ కుటుంబం సోనూకు కృతజ్ఞతలు తెలియజేసింది.