శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి చేరిన బెయిల్ కాపీ... సోమవారం రఘురామ డిశ్చార్జ్

వైకాపా రెబెల్ ఎంపి రఘురామ కృష్ణంరాజుకు రాజద్రోహం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రఘురామపై ఏపీ సీఐడి పోలీసులు ఈ రాజద్రోహం కేసును నమోదు చేసిన విషయం తెల్సిందే. 

రఘురామకు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ విడుదల అయింది. ఈ కాపీని రఘురామ తరఫు న్యాయవాదులు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వర్గాలకు అందజేశారు. రఘురామ ప్రస్తుతం ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఈ క్రమంలో ఆయన ఆసుపత్రి నుంచి సోమవారం డిశ్చార్జి అవుతారని తెలుస్తోంది. బెయిల్ తీర్పు కాపీలో సుప్రీం పలు అంశాలను పేర్కొంది. తన బెయిల్ కోసం రఘురామ 10 రోజుల్లో సీఐడీ కోర్టులో రూ.1 లక్ష పూచీకత్తు చెల్లించి బెయిల్ పొందవచ్చని వివరించింది. 

అందుకోసం ఇద్దరు హామీదార్ల పేర్లను కూడా చేర్చాల్సి ఉంటుంది. ఈ పత్రాలను సోమవారం ఆయన న్యాయవాదులు సీఐడీ కోర్టులో సమర్పించిన మీదట, సైనికాసుపత్రి నుంచి రఘురామ విడుదల కానున్నారు. కాగా, ఇటీవల ఏపీ సీఐడీ అరెస్టు చేసిన రఘురామను చిత్ర హింసలు పెట్టిన విషయం తెల్సిందే.