బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (17:11 IST)

రఘురామ వ్యవహారం సభాహక్కుల కమిటీకి : షరతులతో కూడిన బెయిల్

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. ఓ వైపు బెయిల్ పిటిషన్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. 
 
ఇంకోవైపు, రఘురాజు కుటుంబసభ్యులు తనకు ఇచ్చిన ఫిర్యాదుపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఈ ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి పంపించారు. అంతేకాదు, పూర్తి వివరాలను పంపించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించారు.
 
మరోవైపు సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపు లాయర్ దవే వాదిస్తూ... రఘురాజుకు సంబంధించి ఆర్మీ ఆసుపత్రి ఇచ్చిన నివేదికతో తాము విభేదించడం లేదని చెప్పారు. ఆర్మీ ఆసుపత్రిపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. 
 
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను సర్వోన్నత న్యాయస్థానం మంజూరు చేసింది
 
అయితే రఘురాజుకు గాయాలు ఎలా అయ్యాయనే విషయం ఆసుపత్రి రిపోర్టులో లేదని చెప్పారు. నివేదిక అసంపూర్తిగా ఉందని తెలిపారు. కేసులో కక్షిదారుడు కాని జగన్ పేరును లాగొద్దని అన్నారు.