1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Telangana Bathukamma Festival

సద్దుల బతుకమ్మ పండుగ.. కవితమ్మ శుభాకాంక్షలు

Telangana
బతుకమ్మ పండుగలో భాగంగా శనివారం సద్దుల బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ ‌కల్వకుంట్ల కవిత సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం వీడియోను విడుదల చేశారు. హైదరాబాద్ ప్రజల ఇబ్బందులు త్వరగా తొలగిపోవాలని, గౌరమ్మ తల్లి దయతో కరోనా కనుమరుగవ్వాలని ఎమ్మెల్సీ కవిత ప్రార్థించారు. 
 
ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం బతుకమ్మ పండుగ అంటేనే ఎంతో సందడిగా ఉంటుందని, అయితే ప్రస్తుతం కరోనా ‌మహమ్మారి కారణంగా ఎవరింట్లో వాళ్లు, మాస్కులు పెట్టుకుని పండుగను జరుపుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆడబిడ్డలంతా ఉత్సాహంగా బతుకమ్మ పాటలు నెమరువేసుకుంటూ, యూట్యూబ్‌లో బతుకమ్మ కొత్త పాటలు వింటూ, పెద్దఎత్తున పండుగను జరుపుకుంటున్నట్టు సోషల్ మీడియాలో చూస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
అందుకే ఉద్యోగానికి వెళ్తున్నావా? లాక్‌డౌన్‌లో భార్యకు నరకం, ఆమె ఆత్మహత్య, అవమానంతో మామ కూడా...