ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 అక్టోబరు 2020 (11:55 IST)

తెలంగాణలో కరోనా కలకలం.. ఇద్దరు ఎంపీలకు పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణాలో మొత్తం 6 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 1298కి చేరింది. భద్రాద్రి కొత్తగూడెంలో 86, జీహెచ్ఎంసిలో 249, కరీంనగర్ 75, ఖమ్మం 89, మేడ్చల్ మల్కాజ్ గిరి 111, నల్గొండ 79, రంగారెడ్డి 97 కేసులు నమోదయ్యాయి. 
 
తెలంగాణాలో రికవరీ రేటు 90.53% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 89.5% శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇద్దరు రాజకీయ నేతలు కరోనాబారిన పడ్డారు. రాష్ట్రంలో ఇద్దరు ఎంపీలు కరోనా బారిన పడ్డారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్‌లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కోమటిరెడ్డి ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ క్రమంలో కొవిడ్‌ సోకినట్లు అనుమానంగా ఉందని సమాచారం. అలాగే జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్‌ కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. 
 
అయితే ప్రస్తుతం తాము ఆరోగ్యంగానే ఉన్నామని ఎంపీలు తెలిపారు. వారం రోజులుగా తమతో కాంటాక్ట్‌ ఉన్న వ్యక్తులు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఎవరో ఆందోళన చెందవద్దన్నారు. మరోవైపు తెలంగాణలో తాజాగా 1421 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,29,001 కి చేరింది. ఇందులో 2,07,326 మంది కోలుకొని ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 20,377 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి.