శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 21 అక్టోబరు 2020 (21:52 IST)

తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్‌కు సంపూర్ణేష్ బాబు రూ. 50,000 విరాళం

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. హైదరాబాద్ వరద బాధితులకు తనవంతు సాయంగా 50 వేల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ మంత్రి హరీష్ రావును తన ఇంట్లోనే కలిసి ఆయనకు ఈ చెక్ అందజేసారు. సంపూర్ణేష్ చేసిన సాయాన్ని మంత్రి కూడా ప్రశంసించారు.
 
ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నాను అంటూ తనవంతుగా ఎంతోకొంత సాయం చేస్తూనే ఉంటారు సంపూ. ఇప్పుడు కూడా ఇదే చేసారు. అనుకోకుండా వచ్చిన భారీ వర్షాలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేసాయి. ఈ వరదల్లో ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఇదంతా చూసి తన గుండె కరిగిపోయిందని తెలిపారు సంపూర్ణేష్ బాబు.
 
ఉడతా భక్తిగా తాను ఈ 50 వేల రూపాయలు తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేస్తున్నట్లు తెలిపారు ఈయన. లాక్‌డౌన్ కారణంగా ఎలాంటి సినిమాలు.. షూటింగ్స్ లేకపోయినా కూడా సంపూర్ణేష్ బాబు ఆర్థిక సాయం చేయడం అభిమానులకు మరింత సంతోషాన్ని అందిస్తుంది.
 
మొన్న లాక్‌డౌన్ సమయంలో కూడా తెలుగు సినీ కార్మికులకు లక్ష రూపాయలు విరాళంగా అందజేసారు. షూటింగ్స్ లేకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటూ ఎంతో నిరాడంబరంగా తన కులవృత్తిని చేసుకున్నారు సంపూర్ణేష్ బాబు. సెలబ్రిటీ హోదా ఉన్నా అవేం పట్టించుకోకుండా సాధారణంగా ఉండటమే సంపూర్ణేష్ బాబును ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తుంది.