బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: బుధవారం, 21 అక్టోబరు 2020 (21:39 IST)

మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం క్రిటికల్? పరామర్శించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోమ్ మంత్రి నాయిని నర్సింహా రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
మెరుగైన వైద్యం అందించాల‌ని డాక్ట‌ర్ల‌ను కోరారు. ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయం అవసరం అయినా వెనుకాడవద్దని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. గ‌త నెలలో నాయిని నర్సింహారెడ్డి క‌రోనావైర‌స్ బారిన పడటంతో ఆస్ప‌త్రిలో చికిత్స‌ పొంది కోలుకున్నారు.
ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు కుటుంబ‌స‌భ్యులు. ఈ క్రమంలోనే నాయినికి ఇటీవ‌ల‌ నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. అయినప్పటికీ ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు గుర్తించారు. ఆక్సిజన్‌ పడిపోవడంతో అపోలో వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.