రాబోయే రెండున్నర నెలలు అప్రమత్తంగా వుండాలి.. హర్షవర్ధన్
దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్న తరుణంలో రానున్న రెండు నెలలే కీలకమని కేంద్రం హెచ్చరిస్తోంది. ఇప్పటికే కరోనా నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టినప్పటికీ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలందరూ రాబోయే రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
కరోనా పోరాటంలో భాగంగా వచ్చే రెండున్నర నెలలు ఎంతో కీలకం అంటూ హర్షవర్ధన్ సూచించారు. పండగ సీజన్ చలికాలం రానున్న నేపథ్యంలో ఈ సమయం ఎంతో కీలకమని ఇక ఈ సీజన్లో ప్రతి పౌరుడు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే ప్రాణాంతకమైన కరోనా వైరస్ మహమ్మారిని అంతం చేసే బ్రహ్మాస్త్రం సిద్ధం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు హర్షవర్ధన్.