సంబంధిత వార్తలు
- 2020 శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు: పెద్దశేష వాహనంపై శ్రీ మలయప్పస్వామి
- హ్యాట్సాఫ్ ఎస్పీ, అత్యాచారం బాధితురాలికి ఆర్థిక సహాయం
- 'గో టూ హెల్... స్టుపిడ్' .. నాగేంద్రపై విరుచుకుపడిన తేజస్విని
- #Krack కోసం అప్సరా రాణి ఐటెంసాంగ్.. మాస్ మహారాజాతో సెల్ఫీ వైరల్
- ముఖ్యమంత్రి గారూ.. క్షమాపణలు చెప్పండి.. లేదంటే పదవిపోతుంది: రఘురామకృష్ణ రాజు
ఏపీలో తగ్గుతున్న కరోనా తీవ్రత, 3,967 కొత్త కేసులు, 25 మరణాలు
తెలుగు రాష్ట్రాలలో ఇటీవలి కాలంలో కరోనా పెరుగుతూ వచ్చినా ప్రస్తుతం దాని తీవ్రత తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో సాధారకణ పరిస్థితులు నెలకొనే విధంగా పురోగతి కనిపిస్తోంది. గత కొన్ని నెలల కిందట పరిస్థితులతో పోలిస్తే ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమంత తీవ్రంగా లేదని తెలుస్తోంది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 3,967 పాజిటివ్ కేసులు నమోదు కాగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 627 కొత్త కేసులు రాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 86 మందికి నిర్ధారణ అయ్యింది. తాజాగా 5,010 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులలో మొత్తం పాజిటివ్ కేసు ల సంఖ్య 7,75,470కి చేరగా 7,30,109మందికి కరోనా నయం అయ్యింది. ఇంకా 38,979 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 6,382కి పెరిగింది.
