గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 16 అక్టోబరు 2020 (16:58 IST)

ముఖ్యమంత్రి గారూ.. క్షమాపణలు చెప్పండి.. లేదంటే పదవిపోతుంది: రఘురామకృష్ణ రాజు

న్యాయవ్యవస్థపై ప్రభుత్వ దాడి సరికాదు అని ఈ దాడిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా న్యాయవాదులు ఉద్యమం చేపట్టే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. న్యాయవ్యవస్థపై దాడి కోర్టు ధిక్కారణ నేరంగా పరిగణించాల్సిన అవసరం ఉందని, కోర్టు ధిక్కరణకు పాల్పడినవారు పదవుల్లో ఉండే అర్హత కోల్పోతారని, ముఖ్యమంత్రి జగన్ తన పదవి కూడా  కోల్పోవాల్సి వస్తుందన్నారు రఘురామకృష్ణ రాజు.
 
నేను మా ముఖ్యమంత్రి జగన్‌ను ప్రేమిస్తున్నానని, ఇప్పటికైనా తప్పుడు సలహాదారులను ముఖ్యమంత్రి తొలగించాలన్నారు. తప్పు జరిగిందని భావించి క్షమాపణలు చెప్తే ముఖ్యమంత్రి పదవి నిలిచే అవకాశాలు ఉన్నాయని, లేదంటే ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిని సిద్ధం చేసుకోండి అంటూ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
 
ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిగా కూడా రెడ్డీలే ఉంటారు అని విజయమ్మ, భారతి కూడా ముఖ్యమంత్రి కావచ్చు అంటూ వ్యగాస్త్రాలు విసిరారు రఘురామ కృష్ణం రాజు.