సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 అక్టోబరు 2020 (10:32 IST)

తెలంగాణలో కరోనా అప్‌డేట్.. ఐదుగురు మృతి.. కొత్తగా 1,421 కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. శుక్రవారం కొత్తగా 1,421 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,30,274కి చేరింది. తాజాగా కరోనా కారణంగా ఐదుగురు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,303కి చేరింది. ఈ మేరకు శనివారం ఉదయం వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. 
 
తాజాగా 1,708 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 2,09,034 మంది కరోనాను జయించినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,937 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. 16,809 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో 227 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.