భారత్‌లో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 53,370 కేసులు

coronavirus
coronavirus
సెల్వి| Last Updated: శనివారం, 24 అక్టోబరు 2020 (09:52 IST)
భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 78 లక్షల 14 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 53,370 కేసులు నమోదు కాగా, 650 మంది మృతి చెందారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 67,549 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 78,14,682 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,80,680 ఉండగా, 70,16,046 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 1,17,956 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 89.78 శాతంగా ఉంది.

దేశంలో మొత్తం నమోదై కేసులలో 1.51 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 8.71 శాతంగా ఉంది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 12,69,479 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 10,13,82,564 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.దీనిపై మరింత చదవండి :