కరోనా వ్యాక్సిన్‌ను వాడుకుంటున్న రాజకీయ నేతలు.. ఎలాగంటే?
దేశంలో ముఖ్యంగా బీహర్, మధ్యప్రదేశ్లో కరోనా కేసులు సంఖ్య గణనీయంగా పేరిగే ఆస్కారం ఉంది..ఎన్నికల్లో గెలిస్తే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో ప్రధాన పార్టీలు ముఖ్యంగా బీజేపీ ప్రకటించింది.
తాజాగా పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి ఉచిత కరోనా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించింది. ఈ మేరకు పుదుచ్చేరి సిఎం నిర్ణయం ప్రకటించారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలను ఆకట్టుకోవడానికి ఎన్డియే ప్రభుత్వం వస్తే వ్యాక్సిన్ ఉచితంగా వేస్తామని ప్రకటించిన మరుసటి రోజు దీనిపై ప్రకటన చేసారు సిఎం. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే తాము అందిస్తామని చెప్పారు.
కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ మన దేశంలో రెండు మూడు దశల్లో ఉన్నాయి. భారత బయోటెక్ వ్యాక్సిన్ మూడో దశలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా వ్యాక్సిన్ విషయంలో త్వరలోనే ప్రపంచం గుడ్ న్యూస్ వినే అవకాశం ఉందని చైనా ప్రకటన చేసింది.