శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (13:30 IST)

హోం క్యారంటైన్‍‌లో పుదుచ్చేరి సీఎంతో పాటు 51మంది ఉద్యోగులు

Puducherry CM
కరోనా పుదుచ్చేరిలో విజృంభిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా.. పేద, ధనిక బేధం లేకుండా కాటేస్తోంది. పుదుచ్చేరిలో ఇప్పటివరకు 648 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుండి 252 మంది కోలుకున్నారు. 
 
తాజాగా పుదుచ్చేరి సీఎంతో పాటు 51 మంది ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో నెగటివ్ అని రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సీఎం నారాయణస్వామితో పాటు ఇంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అసెంబ్లీ ఉద్యోగులు 51 మందికి పీటీ-పీసీఆర్ పరీక్షలు చేశారు. 
 
అయితే రిపోర్టులో సీఎం నారాయణస్వామితో పాటు 51 మంది సీఎం కార్యాలయ ఉద్యోగులకు కరోనా నెగిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని పుదుచ్చేరి కుటుంబసంక్షేమశాఖ డైరెక్టరు మోహన్ కుమార్ చెప్పారు. అయినా ముందు జాగ్రత్తగా సీఎం నారాయణస్వామితోపాటు ఉద్యోగులకు వారంరోజుల పాటు హోంక్వారంటైన్ లో ఉండాలని సూచించామని డైరెక్టరు తెలిపారు.