గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 జూన్ 2020 (14:48 IST)

శ్రీరాముడు- గోమాత దయతో కరోనా వైరస్ సోకలేదు : రాజాసింగ్

తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే రాజా సింగ్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ అని వచ్చింది. దీంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. శ్రీరాముడు దయతో తనకు కరోనా నెగెటివ్ ఫలితం వచ్చిందని వ్యాఖ్యానించారు. దీంతో ఆయనతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు ఊపిరిపీల్చుకున్నారు. 
 
కాగా, ఇటీవల రాజా సింగ్ గన్‌మ్యాన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయనతో పాటు.. ఆయన కుటుంబసభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఆ ఫలితాలన్నీ నెగెటివ్ అని నిర్ధారణ అయింది. 
 
ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా రాజాసింగ్ స్పందిస్తూ... శ్రీరాముడు, గోమాత దయతో తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని తేలిందని చెప్పారు. తన క్షేమాన్ని ఆకాంక్షించిన అందరికీ కృతజ్ఞతలు చెపుతున్నానని అన్నారు.