శనివారం, 2 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (21:07 IST)

మంగళ, శుక్రవారం రాళ్ల ఉప్పును తీసుకుని.. ఇలా చేస్తే? (video)

salt
రాళ్ల ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని లాగేసే శక్తి వుంది. తద్వారా దృష్టి లోపాలు తొలగిపోతాయి. ఈర్ష, అసూయ శక్తిని లాగేసే శక్తి ఉప్పుకుంటుంది. అంతేగాకుండా డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతుంటే.. వెంటనే రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. 
 
చేతిలో ధనం నిలబడాలంటే.. ముందుగా ఒక కుండ తీసుకొని అందులో రాళ్ల ఉప్పు వేసి ఒకటో తేదీన జీత ద్రవ్యాన్ని అందులో ఒక రాత్రి ఉంచిన తరువాత దానిని ఖర్చు పెట్టుకోవడం గాని దాచుకోవడం కానీ చేయాలి. 
 
శ్రీ మహాలక్ష్మి దేవి క్షీర సాగరం నుండి అవతరించింది. సముద్రంలో ఉప్పు ఉంటుంది కనుక లక్ష్మీదేవికి ఉప్పు చాలా ఇష్టం. అలాగే మంగళవారం రాత్రి పూట ఉప్పు తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి. 
 
మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదలులో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంకా శుక్రవారం రోజున ఒక గాజు గ్లాసు తీసుకుని అందులో సముద్రపు ఉప్పును వేసి రెండు లవంగాలను కూడా వేసి ఇంటిలో ఒక మూలన పెట్టడం వలన ఇంటిలోని ఆర్థిక సమస్యలు తగ్గుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
 
మంగళ, శుక్రవారాల్లో ఇంటికి వచ్చిన ముత్తైదువులకు పసుపు, కుంకుమ తాగేందుకు నీరు ఇవ్వాలి. పసుపు కొమ్ములను ముత్తైదువులకు ఇవ్వడం వలన జన్మలో చేసిన పాపాలు పోయి కుటుంబములో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని వారు సెలవిస్తున్నారు.