1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Telangana Coronavirus Bulletin, 502 new positive cases

తెలంగాణ కరోనావైరస్ బులెటిన్, కొత్తగా 502 పాజిటివ్ కేసులు

Telangana
తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 502 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 2,57,876కి చేరింది.
 
తాజా కేసులలో 1,539 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు 2,42,084 మంది కరోనాను జయించినట్లు ప్రభుత్వం బులెటిన్లో తెలిపింది. తాజా కరోనా మహమ్మారి కారణంగా ముగ్గురు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,407 కి చేరింది.
 
రాష్ట్రంలో ప్రస్తుతం 14,385 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. 11948 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 17,296 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 48,91,721కి చేరింది. 
About Writer
వి
తర్వాతి కథనం
భారత్‌కు వస్తోన్న కరోనా వ్యాక్సిన్ ఎప్పుడో తెలుసా?