మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: సోమవారం, 16 నవంబరు 2020 (12:20 IST)

బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ నాలుగోసారి బాధ్యతలు స్వీకరణ

బీహార్ ముఖ్యమంత్రిగా నీతీశ్ కుమార్ నాలుగోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజీవ్ భవన్‌లో సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఈసారి ఇద్దరిని వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కతిహార్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తార్ కిశోర్ ప్రసాద్, బెత్తాహ్ ఎమ్మెల్యే రేణు దేవీలను డిప్యూటీ సీఎంలుగా ఖరారు అయినట్లు తెలుస్తోంది. 
 
ఇన్నాళ్లు డిప్యూటీ సీఎంలుగా వ్యవహరించిన సుశీల్ కుమార్ మోడీకి కేంద్రంలో పదవి అప్పగించే అవకాశాలున్నాయి. మరోవైపు తమ ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమార్ అని ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. అయితే ఈ ఎన్నికల్లో 74 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలక పదవులు ఆశించనున్నట్లు తెలుస్తోంది.
 
బీజేపీ కంటే జేడీయూకి తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు నితీశ్ కుమార్‌నే ముఖ్యమంత్రిగా ఆమోదించారు.