శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 నవంబరు 2020 (10:52 IST)

కరోనా కేసులు తగ్గాయ్.. కానీ 435 మంది మృతి

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తాజా కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో భారత్‌లో 30,548 కొత్త కేసులు నమోదుకాగా, 435 మరణాలు సంభవించాయి. 
 
దేశంలో మొత్తం ఇప్పటి వరకు 88,45,127 కరోనా కేసులు నమోదు కాగా, 1,30,070 కరోనా మరణాలు సంభవించాయి. 82,49,579 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,65,478 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 43,851 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇదిలా ఉంటే.. 1,30,070 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 93.27 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.47 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 5.26 శాతంగా ఉంది.