గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 నవంబరు 2020 (16:23 IST)

రష్యాలో కరోనా: ఒక్కరోజే 22,702 కేసులు -391 మంది మృతి

దేశంలోనే కాకుండా విదేశాల్లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా రష్యాలో శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 22,702 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రష్యాలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19 లక్షల మార్కును దాటి 19,03,253కు చేరింది. 
 
రష్యాలోని కరోనా రెస్పాన్స్ సెంటర్ ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తం 22 వేల పైచిలుకు కేసుల్లో 6,427 కేసులు కేవలం రష్యా రాజధాని మాస్కోలోనే నమోదయ్యాయని రెస్పాన్స్ సెంటర్ తెలిపింది.
 
అలాగే కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 391 మంది మృతి చెందారు. దీంతో రష్యాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 32,834కు చేరింది. కాగా, శుక్రవారం కొత్తగా 18,626 మంది కరోనా బాధితులు వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దాంతో రష్యాలో మొత్తం రికవరీల సంఖ్య 14,25,529కి చేరింది.