సంబంధిత వార్తలు
- తెలంగాణాలో బీమ్‌పై ఇన్నోవిటీతో భాగస్వామ్యం చేసుకున్న వివో
- టిక్కెట్ల ధరల పై హైకోర్టు: తెలంగాణ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం
- తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యం.. నేడు నల్గొండలో వైఎస్ షర్మిల దీక్ష
- మహమ్మారి సమయంలో, కాఫీ ఎగుమతుల్లో తెలంగాణ 54% వృద్ధిని చవిచూసింది: డ్రిప్ కాపిటల్ నివేదిక
- సింగరేణి ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రిటైర్డ్ అయిన వారికి మళ్లీ ఉద్యోగం
పెద్దిరెడ్డి ఎంత పనిచేశావు, ఈ దెబ్బతో కాషాయంకు కష్టాలేనా?
హుజారాబాద్ ఎన్నికలకు ముందు నేతల వరుస రాజీనామాలు బిజెపికి తలనొప్పిగా మారుతున్నాయి. మొన్న మోత్కుపల్లి, నేడు పెద్దిరెడ్డిలు పార్టీకి రాజీనామాలు చేశారు. ఈటెల రావడంతో తమ ప్రాధాన్యత పోతుందని ఆందోళన చెందుతున్న నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీలో చర్చకు దారితీస్తోంది. తన రాజీనామా లేఖను తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపారు. తాజా రాజకీయ పరిణామాల బట్టి ఇక తాను ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో పార్టీలో కొనసాగలేనని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.
గతంలో కరీంనగర్ జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందిన పెద్దిరెడ్డి గత కొంత కాలంగా బిజెపి కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల ఈటెల రాజేందర్ బిజెపిలో చేరిన తరువాత ఆయన పార్టీకి దూరమవుతున్నారన్న ప్రచారం జోరుగానే సాగింది.
హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్టును ఆశించిన పెద్దిరెడ్డి తాజా రాజకీయ పరిణామాలతో నిరాశకు గురయ్యారన్న వాదనలు కూడా వినిపించాయి. తనతో చర్చించకుండానే ఈటెలను పార్టీలోకి తీసుకున్నారని పెద్దిరెడ్డి అసంతృప్తితో ఉన్నారట.
ఈ పరిస్థితుల్లోనే పెద్దిరెడ్డి బిజెపికి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి డికె అరుణ పెద్దిరెడ్డితో పలుమార్లు చర్చలు కూడా జరిపారు. పార్టీలో ప్రాధాన్యత దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు. కానీ పెద్దిరెడ్డి మాత్రం బిజెపిలో కొనసాగే విషయంలో అయిష్టంగానే ఉంటూ వచ్చారు.
తాజా పరిణామలతో బిజెపికి గుడ్ బై చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు ఆ నియోజకవర్గంలో పట్టున్న పెద్దిరెడ్డి బిజెపి రాజీనామా చేయడం ఆ పార్టీకి మైనస్‌గా మారే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.