సుప్రసిద్ధ సృజనాత్మక అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, వివో మరియు ఆఫ్‌లైన్ వాణిజ్య వ్యాపారులకు పేమెంట్ పరిష్కారాలను అందిస్తున్న భారతదేశపు అతిపెద్ద సంస్థ ఇన్నోవిటీ పేమెంట్ సొల్యూషన్స్ నేడు తమ విప్లవాత్మక బ్రాండ్ ఈఎంఐ యాక్సలరేషన్ మిషన్ (బీమ్) పథకం కర్నాటక ప్రాంతంలో సాధించిన విజయాన్ని వేడుక చేయడంతో పాటుగా తెలంగాణాలో సైతం ఆ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆఫ్‌లైన్ స్టోర్లు మూతపడటంతో ఎస్‌ఎంబీ వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయాయి. లాక్‌డౌన్స్ అధికకాలం కొనసాగడంతో వినియోగదారులు ఆన్‌లైన్ కొనుగోళ్ల వైపు మళ్లడంతో ఎస్‌ఎంబీ మొబైల్ వ్యాపారం గణనీయంగా తగ్గింది. ఈ సంవత్సరారంభంలో జెనీని ఇన్నోవిటీ ప్రారంభించింది. ఆకర్షణీయమైన రీతిలో110కు పైగా బ్యాంక్‌ల నుంచి క్యాష్‌బ్యాక్‌ను పొందడం, జీరో కాస్ట్ ఈఎంఐ పథకాలను 60కు పైగా బ్రాండెండ్ మరియు ఆన్‌బ్రాండెడ్ ఉత్పత్తులపై అందించడం ద్వారా ఎస్‌ఎంబీ మొబైల్ డీలర్లు తమ వినియోగదారులను తిరిగి తెచ్చుకునేందుకు తోడ్పడగా, బ్రాండెడ్ ఉత్పత్తుల విక్రయాలపై అధిక మార్జిన్లను పొందేందుకు బీమ్ తోడ్పడింది.
బీమ్, ఓ వినూత్నమైన పథకం. ఇది ఎస్‌ఎంబీ మొబైల్ డీలర్లు అదనపు మార్జిన్లను బ్రాండెడ్ ఉత్పత్తులను ఇన్నోవిటీ యొక్క స్మార్ట్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ జెనీ వినియోగించి జీరో కాస్ట్ ఈఎంఐపై విక్రయించడం ద్వారా పొందవచ్చు. ఈ భాగస్వామ్యంతో, ఈ మార్జిన్లను ఎన్‌ఎంబీలు ఇప్పుడు వివో ఉత్పత్తులపై సైతం పొందగలరు.
బీమ్ ఇప్పుడు ప్రధాన స్రవంతి మొబైల్ డీలర్లును సుప్రసిద్ధ మొబైల్ బ్రాండ్లు, ఇన్నోవిటీ యొక్క జెనీ స్మార్ట్ మార్కెటింగ్ యాప్ ద్వారా స్పాన్సర్ చేయబడతాయి. ఈ భాగస్వామ్యం కింద, వివో చేత స్పాన్సర్ చేయబడిన డీలర్లు అదనంగా 1% మార్జిన్‌ను తాము జెనీపై ఈఎంఐ పద్ధతిలో విక్రయించే ప్రతి ఉత్పత్తిపై పొందగలరు. ఇది డీలర్లు అదనపు మార్జిన్లను పొందడంలో సహాయపడటమే కాదు, డీలర్ మరియు బ్రాండ్ నడుమ శక్తివంతమైన బంధం నిర్మించడంలోనూ సహాయపడుతుంది. బీమ్ ఇప్పుడు డీలర్లు సైతం అదనంగా 0.5% మార్జిన్‌ను జీరో కాస్ట్ ఈఎంఐపై విక్రయించే ఇతర మొబైల్ బ్రాండ్లపై పొందేందుకు తోడ్పడుతుంది.
బెంగళూరు మరియు మైసూరులలో 55%కు పైగా ప్రధాన స్రవంతి మొబైల్ రిటైలర్లు జెనీపై లావాదేవీలను నిర్వహించడంతో పాటుగా 1% అదనపు మార్జిన్లతో వివో అందించే స్పాన్సర్‌షిప్ ద్వారా 50వేల రూపాయలకు పైగా పొందుతున్నారు.
దేశంలోని ఇతర ప్రాంతాలలోని మొబైల్ డీలర్లు ఎదుర్కొంటున్నట్లుగానే సమస్యలను ఎదుర్కొంటున్న తెలంగాణా రాష్ట్రంలోని ప్రధాన స్రవంతి మొబైల్ డీలర్ కమ్యూనిటీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇన్నోవిటీ సంస్థ జెనీని రాష్ట్రంలో ఎంపిక చేసిన స్టోర్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఆగస్టు మధ్య నాటికి బీమ్ చేత శక్తివంతం చేయబడిన జెనీని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
వినియోగదారులు తమ ఎలకా్ట్రనిక్ ఉత్పత్తులను ఎంపిక చేసుకునేటప్పుడు వారికి స్పర్శ, అనుభూతి, నమ్మకంను ప్రధాన స్రవంతి మొబైల్ డీలర్లు అందిస్తుంటారు. అయితే, మహమ్మారి వారిపై తీవ్ర ప్రభావం చూపింది. ఆరంభించిన నాటి నుంచి జెనీ, విజయవంతంగా ఈ ప్రధాన స్రవంతి మొబైల్ డీలర్లు తమ వినియోగదారులను తిరిగి పొందడంలో సహాయపడింది. వివోతో మా భాగస్వామ్యం విస్తరించుకోవడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. తద్వారా మా బీమ్ కార్యక్రమాన్ని తెలంగాణాలో ఆరంభించగలుగుతున్నాం. ఎస్‌ఎంబీలు విక్రయిస్తున్న సుప్రసిద్ధ బ్రాండ్లలో వివో ఒకటి.
ప్రతి వివో బ్రాండెడ్ ఉత్పత్తిపై అదనపు మార్జిన్లు పొందడం అనేది ఈ ఎస్‌ఎంబీలు మరింతగా సంపాదించేందుకు మరియు మరింతగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. ఇది తెలంగాణాలో ఎస్‌ఎంబీలకు అదనపు ఇంధనం అందించడంతో పాటుగా తమ వ్యాపారాలు తిరిగి పుంజుకోవడంలోనూ తోడ్పడుతుంది అని శ్రీ ప్రసాద్ సోనావానీ, చీఫ్ రెవిన్యూ ఆఫీస్- పార్టనర్‌షిప్స్ అండ్ అలయెన్సెస్, ఇన్నోవిటీ అన్నారు.
భారతదేశపు మార్కెట్‌లో మేము మా కార్యక్రమాలను ఆరంభించిన నాటి నుంచి, ప్రధాన స్రవంతి రిటైల్ సంస్థలు మా మొదటి ప్రాధాన్యతగా నిలిచారు. మా సంయుక్త వృద్ధిలో మా భాగస్వాములుగా ప్రధాన స్రవంతి రిటైలర్లు నిలువగలరని మేము నమ్ముతున్నాం. వారి వ్యాపార ప్రయోజనాలను మేము ఎల్లప్పుడూ రక్షిస్తూనే ఉంటాం. బ్రాండ్ ఈఎంఐ యాక్సలరేషన్ మిషన్(బీమ్)లో ఉన్న అద్భుతమేమిటంటే, ప్రధాన స్రవంతి మొబైల్ రిటైలర్లు అదనపు మార్జిన్లను పొందగలగడం. అది వారి వ్యాపారాలపై సానుకూల ప్రభావం చూపగలదు అని వివో మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి అన్నారు.
సంప్రదాయేతర మార్గాలలో తమ చెల్లింపుల సాంకేతికతను ఇన్నోవిటీ వినియోగిస్తుంది. ఇది చెల్లింపుల లావాదేవీలను వ్యాపారులు, బ్యాంకులు, బ్రాండ్లకు వినియోగదారులను సొంతం చేసుకోవడం మరియు నిలుపుకునే ఉపకరణంగా నిలుస్తుంది. ప్రతి వ్యాపారమూ మూడు రెట్ల లాయల్ కన్స్యూమర్లు, మూడోవంతు ఖర్చు, సాటిలేని సామర్థ్యంలతో వేగవంతమైన అమ్మకాలను పొందగలదు.