శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 జులై 2021 (12:56 IST)

తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యం.. నేడు నల్గొండలో వైఎస్‌ షర్మిల దీక్ష

తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యమంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీతో పేరు పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్‌ షర్మిల.. వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు. నిరుద్యోగ వారం- నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా YSRTP అధ్యక్షురాలు వైయస్. షర్మిల నేడు.. నల్గొండ జిల్లా చండూరు (మం) పుల్లెంలలో దీక్ష చేపట్టనున్నారు. 
 
అందులో భాగంగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం పాదయాత్రగా శిబిరాన్ని చేరుకుని సాయంత్రం ఆరు గంటల వరకు నిరాహార దీక్ష చేస్తారు. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి వెల్లడించారు.
 
వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధినేత్రి వైఎస్‌ షర్మిల దేశాంగాణలోని వివిధ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా ఆమె ఖమ్మం జిల్లాలో పర్యటించారు. నిరుద్యోగులకు మద్దతుగా నిరాహార దీక్ష చేశారు. అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు షర్మిల. 
 
ఇక మంగళవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని చండూరు మండలం పుల్లెంల గ్రామంలో నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు. గ్రామంలో ఇటీవల ఉద్యోగం రాక ఆత్మహత్యకు పాల్పడిన పాక శ్రీకాంత్‌ (26) కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం దీక్ష ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు విరమిస్తారని సన్నాహక కమిటీ కన్వీనర్‌ ఇరుగు సునీల్‌ తెలిపారు.