శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 జులై 2021 (17:41 IST)

రూ.2వేల కోట్లు ఇస్తానంటే రాజీనామా చేస్తా.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు అభివృద్ధి కోసం రూ.2వేల కోట్లు ఇస్తానంటే రాజీనామా చేస్తానని రాజ్‌గోపాల్‌రెడ్డి సవాల్‌ చేశారు. బైఎలక్షన్‌ వస్తేనే అభివృద్ధి చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 
 
అలా అయితే తాను ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తానని వెల్లడించారు. అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం అమలు అవుతుందా అని అన్నారు. ఎంతసేపు రాజకీయలబ్ధి తప్పా ప్రజాపాలనపై దృష్టిసారించడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
 
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మనుగోడు అభివృద్ధికి ఎన్నిసార్లు అడిగినా నిధులు ఇవ్వట్లేదన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే నిధులిస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో అన్ని ఎస్సీ కుటుంబాలకు నిధులు ఇస్తున్నారు. ఇతర చోట్ల 100 కుటుంబాలకే ఇస్తామనడం సబబా? అని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు.