1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (17:17 IST)

సినిమాల ప్ర‌ద‌ర్శ‌న‌కు ఓకే అన్నందుకు త‌ల‌సానికి కృత‌జ్ఞ‌త‌లు

TFCC-Talasani
థియేటర్ల రీ ఓపెనింగ్‌కు సంబంధించిన ఇబ్బందులు, ప్రభుత్వం గతంలో ప్రకటించిన హామీల అమలు తదితర అంశాలపై ఓ స్పష్టతను కోరతూ ఇటీవ‌లే ప్ర‌భుత్వానికి ఎగ్జిబిట‌ర్లు విన్న‌వించారు. ఆ సంద‌ర్భంగా తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ), ఎగ్జిబిటర్స అసోసియేషన్‌ సభ్యులు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను కలిశారు. అయితే టీఎఫ్‌సీసీ, ఎగ్జిబిటర్స్‌ల అభ్యర్ధనల మేరకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందిచి కొన్ని సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టి, థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శనకు మార్గం మరింత సుమగం చేసింది. 
 
ఈ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్ స‌భ్యులు, తెలంగాణ థియేటర్‌ ఓనర్స్,  డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్ స‌భ్యులు త‌మ‌ సమస్యలను పరిష్కరించిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ను కలిసి స‌త్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇంకా ప‌లు స‌మ‌స్య‌లు పెండింగ్‌లోనే వున్నాయి. థియేట‌ర్ల‌లో వెహిక‌ల్ పార్కింగ్‌కు ప్ర‌భుత్వం అనుమ‌తించింది.