శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 11 మే 2021 (12:28 IST)

ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులు ఎందుకు ఆపారు? తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న- Newsreel

ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న అంబులెన్సులను తెలంగాణ సరిహద్దులలో నిలిపివేస్తుండడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి విపత్కర సమయంలో మానవత్వం లేకుండా అంబులెన్సులు ఆపేయడం ఏమిటని ప్రశ్నించింది. ఏ అధికారంతో అంబులెన్సులను రానివ్వకుండా అడ్డుకున్నారని ప్రశ్నించింది.
 
మరోవైపు తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణకు చేపడుతున్న చర్యలపైనా కోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. సామూహిక ప్రార్థనలలో కరోనా నిబంధనలు అమలు కావడం లేదని కోర్టు అభిప్రాయపడింది. రంజాన్ తరువాత చర్యలు చేపట్టాలని అనుకుంటున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెలంగాణలో రాత్రి పూట కర్ఫ్యూ ప్రకటించినా అది సక్రమంగా అమలు కావడం లేదని కోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది.
 
కోర్టు ఆదేశాలను పక్కనపెడితే ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గంతో సమావేశమవుతున్నారని.. నైట్‌కర్ఫ్యూ పొడిగింపు, లాక్‌డౌన్ వంటి అంశాలపై నిర్ణయం తీసుకుంటారని ఏజీ కోర్టుకు తెలిపారు.