సంబంధిత వార్తలు
- తెలంగాణ బిడ్డలు రాజ్యం ఏలాలి.. రాజన్న బిడ్డలు కాదు.. రేవంత్ రెడ్డి
- వైఎస్. షర్మిల పార్టీ వెనుక కేసీఆర్ వున్నారు.. చెప్పిందెవరంటే?
- చెత్త వాగుడు వాగితే పీకిపడేస్తా.. సీఎం పదవి ఎడమకాలి చెప్పుతో సమానం : కేసీఆర్
- తెలంగాణలో 101 కరోనా కేసులు.. దేశంలోనూ తగ్గుతున్న కోవిడ్
- జగిత్యాలలో ద్విచక్రవాహనదారులకు పెట్రోల్ బంద్.. ఎందుకు?
తెలంగాలో టెన్త్ పరీక్షలు.. టైమ్ టేబుల్ విడుదల
తెలంగాణలో టెన్త్ కాస్ల్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ టీఎస్ ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. కరోనా కారణంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం పూర్తి స్తాయిలో సాధ్య పడలేదు. దీంతో ఈ విద్యా సంవత్సరంలో ఆరు పేపర్లకు కుదిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. మే 17 లాంగ్వేజ్ పరీక్ష నుంచి 26 సోషల్ స్టడీస్ తో పరీక్షలు ముగియనున్నాయి.
పరీక్షా సమయం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ఉంటుందని తెలిపింది. పరీక్షలకు హాజరైయ్యే విద్యార్థులు 30 నిమిషాల ముందుగానే పరీక్షాకేంద్రానికి హాజరుకావాలని విద్యాశాఖ ప్రకటించింది.
పరీక్షల తేదీలు
మే 17న తెలుగు,
మే 18న హిందీ,
మే 19న ఇంగ్లీష్,
మే 20న మ్యాథ్స్,
మే 21న సైన్స్,
మే 22న సోషల్ పరీక్షలు జరుగుతాయని ఎస్‌ఎస్‌సీ బోర్డు పేర్కొంది.
