సంబంధిత వార్తలు
- స్పీడ్ బ్రేకర్లు లేని కరోనా.. దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు
- మనస్థిమితం లేని యువతిపై సామూహిక అత్యాచారం..
- 3 కోట్లకు చేరిన పాజిటివ్ కేసులు... తెలంగాణాలో కరోనా విజృంభణ
- సోనమ్, మరోసారి నీ మొగుడి ముఖం చూడు, ఎలా వున్నాడో? నెటిజన్ ట్రోల్, సోనమ్ ఆగ్రహం
- ఇంట్లోకి చొరబడిన పాము.. నిద్రలో మహిళ.. నుదుటిపై కాటేసింది..
శృంగారపు వీడియోలతో వలపు వల.. ధనికులు - వ్యాపారులే లక్ష్యంగా...
ఓ మహిళ శృంగార వీడియోలతో వలపు వల పన్నింది. కేవలం ధనికులు, వ్యాపారస్తులే లక్ష్యంగా ఆమె ఎత్తులు వేసింది. తన వలలో చిక్కుకున్న వారిని నయానోభయానో బెదిరించి లక్షలాది రూపాయలు గుంజసాగింది. ఇలా ఆమె చేతిలో మోసపోయిన ఓ బడా వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ బండారం మొత్తం బట్టబయలైంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో వెలుగు చూసింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, పాల్వంచ పట్టణంలోని టీచర్స్‌కు కాలనీకి చెందిన ఓ మహిళ ముందుగా ఆర్థికంగా ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటుంది. ఆ తర్వాత స్నేహం పేరుతో వారికి వలపు వల విసురుతుంది. ఈ వలలో చిక్కుకున్న వారిని శారీరకంగా లొంగదీసుకుని, రహస్యంగా వీడియోలు తీస్తుంది. ఆ తర్వాత భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేయడం ఆనవాయితీగా మారిపోయింది.
ఈ క్రమంలో ఇటీవల శాస్త్రిరోడ్‌కు చెందిన ఓ బడా వ్యాపారిని ఇదే తరహాలో లొంగదీసుకుంది. ఇద్దరు చాటుమాటుగా కలిసిన వీడియో తన వద్ద ఉందని, అందుకు రూ.10 లక్షలు ఇవ్వాలని, లేకుంటే సామాజిక మాధ్యమాల్లో పెట్టి పరువు తీస్తానని బెదిరింపులకు దిగింది. పాల్వంచ, ఇల్లెందు పట్టణాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు డబ్బుల కోసం రాయబారం నడపడం గమనార్హం.
దీంతో సదరు వ్యాపారి అంతమొత్తం ఇచ్చుకోలేక చివరికి పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో సదరు వ్యాపారితో డబ్బులు కొంత మొత్తం ఇస్తామని రప్పించి మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
అనంతరం ఆమె మొబైల్ ఫోనును పరిశీలించగా, అందులో పలువురి చిత్రాలు, వీడియోలు ఉన్నాయి. దీంతో ఈ ఊబిలో మరికొందరు చిక్కుకున్నారనే విషయం వెలుగు చూసినట్లు సమాచారం. కేటీపీఎస్ డీఈ స్థాయి అధికారి, మరో ఫోర్‌మెన్, భద్రాచలానికి చెందిన ఓ వ్యక్తి కూడా వలపు వలలో పడ్డట్లు సమాచారం.