శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2020 (16:10 IST)

సోనమ్, మరోసారి నీ మొగుడి ముఖం చూడు, ఎలా వున్నాడో? నెటిజన్ ట్రోల్, సోనమ్ ఆగ్రహం

బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అనంతరం ఇండస్ట్రీలోని స్టార్ కిడ్స్ పైన ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై స్టార్ కిడ్స్ చాలా ఆవేదన చెందుతున్నారు.
 
తాజాగా ఇలాంటి అనుభవం సోనమ్ కపూర్‌కి ఎదురైంది. ఆమెకి ఓ మహిళ పెట్టి కామెంట్ పైన సోనమ్ ఘాటుగా స్పందించింది. ఇంతకీ ఆమె పెట్టిన కామెంట్ ఏంటంటే... ''మీ నాన్న లేకపోతే నువ్వు శూన్యం సోనమ్. నీకసలు నటించడం ఏమాత్రం రాదు. నట వారసత్వం వల్ల కొన్ని సినిమాలు వచ్చాయి. అంతే... నీలాంటి మహిళకు భారతదేశంతో పాటు ప్రపంచం ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు సంతోషకరం.
 
అసలు నీ భర్త ముఖం చూశావా, అతడు చాలా అందంగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావేమో, మరొక్కసారి ఆయన ముఖం చూడు. ఎంత అందవిహీనంగా ఉన్నాడో తెలుస్తుంది" అంటూ ఆ మహిళ కామెంట్ చేసింది. దీనిపై సోనమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "ఈ మహిళ యెవరో నాకు నీచమైన సందేశం పంపింది.
 
ఇలాంటి కామెంట్లు పెట్టి పాపులర్ అవ్వాలనుకుంటుంది. ఇంతలా ద్వేషం మనసులో వుంటే ఆ ద్వేషం వారినే నాశనం చేస్తుంది" అటూ రిప్లై ఇచ్చింది. దానికి సదరు మహిళ మళ్లీ స్పందిస్తూ... ఇది నేను పెట్టిన మెసేజ్ కాదు. నా ఖాతా ఎవరో హ్యాక్ చేసి ఇలాంటివి పెట్టారు. నేను కాదు అంటూ కామెంట్ పెట్టింది.