మనస్థిమితం లేని యువతిపై సామూహిక అత్యాచారం..

rape
rape
సెల్వి| Last Updated: సోమవారం, 21 సెప్టెంబరు 2020 (10:25 IST)
కరోనాతో జనాలు ప్రాణాలు కోల్పోతున్నా.. కామాంధులు మాత్రం మారట్లేదు. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతూనే వున్నారు. తాజాగా చెన్నైకి చెందిన ప్రభుత్వాస్పత్రి సమీపంలో మతిస్థిమితం లేని యువతిని ఐదురోజుల క్రితం ఆటోలో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ ప్రభుత్వాస్పత్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో 15 రోజులుగా మతిస్థిమితం లేని 28 ఏళ్ల యువతి సంచరిస్తోంది.

శనివారం అదే ప్రాంతంలో ఓ హోటల్‌ ముందు రక్తగాయాలతో, చిరిగిపోయిన దుస్తులతో పడి ఉండడాన్ని గమనించిన హోటల్‌ వంట మాస్టర్‌ పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకొని ఆమెను చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు.

విచారణలో ఆమెను గత ఐదు రోజులుగా అదే ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆటోలో ఎక్కించుకొని శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి తిరిగి ఆ ప్రాంతానికి తీసుకొస్తుండేవారని పోలీసుల విచారణలో తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నలుగురి కోసం గాలిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :