మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2020 (14:26 IST)

ఇంట్లోకి చొరబడిన పాము.. నిద్రలో మహిళ.. నుదుటిపై కాటేసింది..

భారీ వర్షాల కారణంగా పాములు ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా ఓ నిద్రపోతున్న మహిళ ఇంటికి పాము వెళ్లింది. అంతేకాకుండా ఆమె నుదుటి మీద కాటేసింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని కూలలింగాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎమిలీ హిండ్స్ అనే మహిళ మంగళవారం సోషల్ నెట్‌బాల్‌లో సెలబ్రేషన్స్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి పడుకుంది. అప్పుడు ఆమె డ్రింక్ చేసింది. 
 
మద్యం మత్తులో అలానే నిద్రపోయింది. సరిగ్గా 2 గంటల సమయంలో ముఖం మీద ఏదో తిరుగుతున్నట్లు అనిపించింది ఆమెకు. గాలికి జుట్టు కదలడం, హెయిర్‌క్లిబ్ అయింటుందని అనుకుంటూనే ఉన్నది కాని కళ్లు తెరవలేదు. కాసేపటికే ఆ పాము నుదిటిమీద కాటేసింది. దీంతో ఆ మహిళకు దెబ్బకు మెలకువ వచ్చింది. 
 
లేచి చూసుకుంటే నుదుటిమీద గాట్లు ఉన్నాయి. పక్కనే ఉన్న ఆమె భర్తను నిద్రలేపింది. అతను పాము ఎక్కడుందో వెతికి గుర్తించాడు. ఆ సమయంలోనే చేసేదేం లేక పాము తోకను పట్టుకొని పెరట్లోకి విసిరేశాడు. ఆ పాము చిన్నది కాబట్టి సరిపోయింది. పెద్దదైతే ప్రాణాలకే ప్రమాదం జరిగేదని వైద్యులు చెప్తున్నారు.