మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (14:21 IST)

యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్ విజేతగా నిలిచిన ఒసాకా

Naomi Osaka
యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో జపాన్‎కు చెందిన క్రీడాకారిణి ఒసాకా విజేతగా నిలిచింది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఒసాకా 1-6, 6-3, 6-3 తేడాతో అజరెంకాపై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 
 
నాలుగో సీడ్ అయిన ఒసాకా మొదటి సెట్‌ను ఒసాకా కొద్దీ పాయింట్ల తేడాతో కోల్పోయినప్పటికీ.. మిగతా రెండు సెట్లలో ఒసాక ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా బరిలో నిలిచి టైటిల్‌ను స్వంతం చేసుకుంది.
 
ఒసాకాకు ఇది రెండో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌. 2018లో కూడా యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచింది ఒసాకా. ఒసాకాకు ఇదీ మూడో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌. క్రిందటి ఏడాది జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ను ఒసాకా టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.